May 06,2023 21:56

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీదేవి

'జలజీవన్‌ మిషన్‌'పై అవగాహన
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జలజీవన్‌ మిషన్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ శ్రీదేవి మాట్లాడుతూ పథకం తీరుతున్నలపై సమీక్షించారు. జల జీవన్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ శర్మ మాట్లాడుతూ కొంతమంది మహిళలకు శిక్షణ ఇస్తామని వివరించారు.
ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు పరిచేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎంపిటిసి దర్శిగుంట శశిరేఖ మాట్లాడుతూ ఈ పథకాన్ని అమలు చేసుకుంటే గ్రామాల్లో తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని తెలియజేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పూర్తిస్థాయిలో వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి పెంచల వీరేంద్ర, పలువురు గ్రామ సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.