జక్కా పార్వతమ్మ సంతాపసభ
ప్రజాశక్తి-జలదంకి : స్థానిక సురే చెంచురెడ్డి భవనంలో గడ్డం మాల్యాద్రి అధ్యక్షతన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎ, సిపిఎం సీనియర్ నేత జక్కా వెంకయ్య సతీమణి జక్కా పార్వతమ్మ మృతికి తొలుత సంతాపం వ్యక్తం చేసి జోహార్లు అర్పించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ జక్కా పార్వతమ్మ సిపిఎం పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. 13వ తేదీన జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులు మీగడ వెంకటేశ్వర రెడ్డిని, పొక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతుల ధాన్యం గిట్టుబాటు రేటు ప్రభుత్వం నిర్ణయించిన రూ.17500 కొనుగోలు చేయడం లేదని 'కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మద్దతు రేటు సాధించుకునే దానికి రైతులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు అడపాల సురేష్, రైతు సంఘం నాయకులు రావి మాధవరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బత్తల నరసింహ, మహిళా సంఘం తరఫున మారుబోయిన కొండమ్మ, తదితరులు పాల్గొన్నారు.










