మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు
జిఒ నెంబరు ఒకటితో ప్రజాస్వామ్య హక్కులపై దాడి
నెల్లూరు:రూరల్ మండలం పొ ట్టే పాలెం గ్రామంలో జీవో నెంబర్ ఒకటి ప్రజాస్వామ్య హక్కుల పై దాడి అనే అంశంపై బహిరంగ అధ్యయన వేదికనిర్వహించారు. శనివారం జరిగిన ఈ బహిరంగ అధ్యయన వేదికలో సిపిఎం జిల్లా సెక్రె టీ రియట్ సభ్యులు ఎం మోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం గాని ప్రత్యామ్నాయాలు ప్రజలకు చూపిస్తూ ప్రైవేటు స్థలాలు ,మైదానాలు వంటి స్థలాల్లో పబ్లిక్ మీటింగ్ ల ను పెట్టుకోవలసిన దుస్థితి తీసుకొచ్చిందన్నారు. స్వాతంత్రానికి పూర్వం పోలీస్ చట్టం జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చారని ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ఈ చట్టం ఏ విధంగానూ ఉపయోగపడదనీ భావించారన్నారు. ఈ జివో వల్ల రాజకీయ ప్రభావం విపరీతంగా పెరిగి చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు త లొగ్గి పనిచేస్తారన్నారు. సమాజంలో మాట్లాడే వారి ప్రశ్నించే వారి గొంతు నొక్కి పౌరుహక్కులపై నిర్బంధం తీసుకొని రావడం సరైన చర్య కాదని తలంచి సభలు సమావేశాలపై సహేతుకమైన షరతులు విధించి ప్రజల భద్రతను సౌకర్యాలను కాపాడాలని కాబట్టి ప్రజా వ్యతిరేక జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ జీవో అత్యంత అప్ర జాస్వామికమైనదని, సభ లు, ర్యాలీలు రోడ్డు షోలు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు మున్సిపల్ పంచాయతీ రోడ్లపై అనుమతి ఇవ్వకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. ప్రజలకి వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ లతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును మన రాజ్యాంగం కల్పించిందన్నారు. ఏ సందర్భాలలో ఆంక్షలు విధించవ చో రాజ్యాంగం వివరించిందని, ప్రజల గొంతు నొక్కడానికి ఈ జీవో తీసుకొచ్చారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని కాబట్టి ఈ జీవోను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ బహిరంగ అధ్యయన వేదికలో సిపిఎం నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు, మండల నాయకులు ఎడవల్లి రమణయ్య, జానా లక్ష్మీ ప్రసాదు ముత్యాల నాగయ్య, ఏ అనిల్ తదితరులు పాల్గొన్నారు.










