Jan 10,2023 20:43

నినాదాలు చేస్తున్న నాయకులు

నినాదాలు చేస్తున్న నాయకులు
జిఒ నెంబరు ఒకటిని రద్దు చేయాలి
నెల్లూరు:బెంగుళూరులో జనవరి 18 -23 వరకు సిఐటియు అఖిలభారత మహాసభలు జరుగుతున్న సందర్భంగా జయప్రదం చేయాలని కోరుతూ. వేదాయపాలెంలోని సిఐటియు నెల్లూరు రూరల్‌ కార్యాలయం వద్ద జండా ఆవిష్కరణ సిఐటియు జిల్లా కార్యదర్శి కటారి అజరు కుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం వైయస్సార్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్‌: 1ని రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శి కటారి అజరు కుమార్‌ మాట్లాడుతూ. మత విద్వేషకర, విభజన శక్తుల ఓటమి, ఉదారవాద విధానాలు, సామ్రాజ్యవాద శక్తుల కుట్రలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ ఐక్యత-తీవ్ర పోరాటాలు అనే నినాదంతో సిఐటియు అఖిల భారత17వ మహాసభలు జరుగుతున్నాయన్నారు. సిఐటియు రూరల్‌ కార్యదర్శి కిన్నెర కుమార్‌ మాట్లాడుతూ. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్‌ ఒకటిని అమలులోకి తీసుకొచ్చిందని, ఇది చీకటి జీవో అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే జీవో అని అన్నారు. ప్రజాసంఘాల ఆందోళనలు చేసేందుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి జీవో అని అర్థమవుతుంది అని అన్నారు. ప్రజా సంఘాల ఆందోళనలను చూసి ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. అందుకే నిర్బంధ ఖండా చేయాలని చూస్తున్నారని అన్నారు.
ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హక్కుగా ఉంది అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కొత్త రాజ్యాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రచిస్తున్నారేమో అర్ధం కావడం లేదన్నారు. ఇప్పటికైనా జీవో నెంబర్‌: 1ని రద్దు చేయాలని కోరినారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రూరల్‌ అధ్యక్షులు కొండ ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సిఐటియు కార్యదర్శి వర్గ సభ్యులు దేవతార్‌ డి సంపత్‌ కుమార్‌ , బత్తల కష్ణయ్య , ఎం. సుధాకర్‌, సిహెచ్‌ సుజాతమ్మ, అంజిరెడ్డి,ఎస్‌కె ఖలీల్‌, తిరుపాల్‌ రూరల్‌ కమిటీ సభ్యులు, శంషాద్‌, దేశ మూర్తి, దేవతాటి లవన్‌ కుమార్‌, ఈశ్వర్‌ రెడ్డి, ఆటో కార్మిక సంఘం కార్మికులు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు, రిక్షా కార్మికులు ముఠా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.