జిఒ నెంబర్ 1ని ఉపసంహరించుకోవాలి
ప్రజాశక్తి-కావలి : వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జిఒ నెంబర్ 1ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం కావలి అంబేద్కర్ విగ్రహం వద్ద జిఒ కాగితాలను తగులబెట్టారు. జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు పసుపులేటి పెంచలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, కాంగ్రెస్ నాయకుడు చింతాల వెంకట్రావు, టిడిపి నాయకుడు గుత్తికొండ కిషోర్‌బాబు, సిపిఐ ఎం ఎల్ లక్ష్మి రెడ్డి, సిపిఐ ఎం ఎల్ న్యూడెక్రసీ కరవది భాస్కర్, జనసేన నాయకుడు పోబ్బా సాయి విఠల్ మాట్లాడారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులలో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభల్లో వరుసగా తొక్కిసలాటల ఘటనలు సాకుతో, ప్రజా వ్యతిరేక అణచివేసే ప్రతిపక్షం పీక నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివాదస్పద జిఒ నెంబర్ 1ను బ్రిటీష్ కాలంనాటి 1861 పోలీసు చట్టం హోంశాఖ ముఖ్యకార్యదర్శి హారీష్ కుమార్ గుప్తా ఆర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీశారన్నారు. రోడ్లు పైబహిరంగ సభలు ర్యాలీలు చేయక్షుదని షరతులతో కూడిన పోలీసు యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం కానుగా జిఓనెం1 ను తీసుకొచ్చిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఒను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకుడు కె.నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎ.సుబ్రమణ్యం, టిడిపి నాయకులు కాకి ప్రసాద్, గుత్తికొండ కిషోర్ బాబు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










