Jan 05,2023 20:00

జిఒ ప్రతులు దగ్ధం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరిన టిడిపి నాయకులను సిఐ వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం అడ్డుకున్నారు. పోలీసులతో కంచర్ల శ్రీకాంత్‌, దామా మల్లేశ్వరరావుల వాగ్వాదానికి దిగారు. అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు అనుమతించాలని పోలీసులను కోరారు. ఓక్కరికి మాత్రమే ఆనుమతి ఇస్తామని చెప్పారు. దాంతో జిఒ కాపీలు తగలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకొని పోలీసులు కంచర్ల శ్రీకాంత్‌ అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. అనతరం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కాఫీలు దహనం చేశారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర, రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధికార ప్రతినిధి షేక్‌ రఫీ, నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల వెంకట సుబ్బారావు, నియోజవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు మద్దసాని కష్ణ, నియోజవర్గ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి ఉన్నారు.