పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వే పనులను సకాలంలో వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వివరించారు. గురువారం విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీసర్వే, మ్యుటేషన్స్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సిసిఎల్‌ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రామకష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే కోసం రెండవ విడతలో 28 గ్రామాలను ఎంపిక చేయగా, రెండు గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. 23 గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియ, మరో ఐదు గ్రామాల్లో లైక్టోరైజేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడుతలో 26 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయ్యాయని తెలిపారు.
సుస్థిర సమగ్ర అభివద్ధి లక్ష్యాలను సాధించండి
విజయవాడ నుంచి గురువారం స్థిరమైన అభివద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజిగోల్స్), ఆరోగ్యం మరియు స్త్రీ శిశు సంక్షేమం, వివిధ ప్రభుత్వ పథకాలు అమలు, స్కూలు ఎడ్యుకేషన్, పిఆర్, ఆర్‌డి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్‌లతో చీఫ్ సెక్రటరీ డా||జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బసంత్ కుమార్, డిఆర్‌ఒ కొండయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను అభివద్ధి పరచడానికి సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. రక్తహీనత లోపం ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి పెట్టాలని, వారికి సరైన పోషకాహారం అందించాలన్నారు. బాల్య వివాహాలు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలన్నారు. మనబడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన జిల్లాలో న్యూట్రిషనల్ హ్యాబిటేషన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలును సజావుగా చేపడతామన్నారు. తదనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కషి చేయాలని డ్వామా అధికారులను ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివద్ధి లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.










