రాయచోటి : క్రీడలలో ఇంకా బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ గిరీష గురువారం పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజులు పాటు అరుణాచల ప్రదేశాల్లోని ఇటానగర్లో జరిగిన రెండవ జాతీయ ఫ్లోర్ క్లరింగ్ సీనియర్ ఛాంపియన్ షీప్ 2023 పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటటంపై కలెక్టర్ అభినందించారు. చిన్నమండెం మండలం, దేవలంపేట సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కె.మేరి సుష్మ ఫ్లోర్ క్లరింగ్ సీనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ కేటగిరీలో వై కిస్టియానా, టి.జన్నిఫర్ సులోచన కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. వీరిని కలెక్టరేట్లోని కలెక్టర్ వారి చాంబర్లో కలెక్టర్ అభినందించి క్రీడల్లో ఇంకా బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డిఎస్‌డిఒ మహమ్మద్ షఫీ పాల్గొన్నారు.










