మడకశిర : సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 4485మంది వృద్ధుల, వికలాంగుల, వితంతువుల, ఒంటరి మహిళల పింఛన్ల తొలగింపునకు కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. బుధవారం మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 19, 20 వార్డులలో చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఒక్క అవకాశం అంటూ రాష్ట్ర ప్రజల నెత్తిన కూర్చొన్న జగన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి పాతాళంలోకి నెట్టేశారని విమర్శించారు. ఈ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు భక్తర్, పట్టణ అధ్యక్షులు మనోహర్, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, క్లస్టర్ ఇన్‌ఛార్జి నాగరాజు, కౌన్సిలర్ ఉమా శంకర్, 4వ వార్డు కౌన్సిలర్ హనుమంతు, మాజీ కౌన్సిలర్లు గోవిందప్ప, నాగరాజు, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తిమ్మరాజు, గోవింద తదితరులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తనకల్లు : మండల పరిధిలోని ఈతోడు, రాక్కుంటపల్లి, బిల్లూరివాండ్లపల్లి గ్రామాలలో టిడిపి నాయకులు బుధవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి ప్రజలకు వివరించారు. వైసిపి హయాంలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సొంపాళ్యం నాగభూషణ, మల్లికార్జున, దామోదర్, ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : మండలంలోని ఈదులకుంట్ల పల్లి, మంగి వాండ్లపల్లి, మడుగు తండాతో టిడిపి నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ముబారక్, పరిశీలకుడు, బండారు మనోహర్ నాయుడు, పల్లపు రామాంజినేయులు, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు.










