Feb 01,2023 19:51

కబడ్డీ బాలికల జట్టుకు కప్‌ను అందజేస్తున్న నిర్వాహకులు

ప్రజాశక్తి-రాయచోటి : రాయచోటిలోని ఐకె పాఠశాలలో యూత్‌ ఐకాన్‌ వినరు కుమార్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. బుధవారం ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా రాయచోటి డిఎస్‌పి శ్రీధర్‌, మనోజ్‌ కుమార్‌ రెడ్డి, శివ గంగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ యూత్‌ ఐకాన్‌ వినరు కుమార్‌ జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోచాహించేలా కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచిదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ఐకె పాఠశాల వారిని ఆయన అభినందించారు. మనోజ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే నిర్వహించడం హర్షనీయమన్నారు. శివగంగిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు ఆరోగ్యవంతంగా తయారవుతారని చెప్పారు. ఐకె పాఠశాల కరస్పాండెంట్‌ ఇసక్‌అలీఖాన్‌, ఆర్గనైజర్‌ వినరుకుమార్‌ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ విజయవంతానికి కషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. పోటీలల్లో విజేతలుగా బాలుర జట్టు దేవపట్ల హైస్కూల్‌, బాలికలు జట్టు కలిచేర్ల హై స్కూల్‌, రెండో స్థానం సాధించిన వారు బాలికలు నులివీడు హైస్కూల్‌, బాలుర గాలివీడు హైస్కూల్‌ జట్టు క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ బహుమతులు, ధవపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస రాజు, అమర్నాథ్‌ రెడ్డి, వీరాంజనేయులు, లాలితమ్మ, సులోచన, పుష్ప, కరుణాకర్‌, అలీ, అన్నమయ్య జిల్లా పీడీలు, ఉపాధ్యాయులు విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.