కరపత్రాలు విడుదల చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి -పెనుకొండ : డిసెంబర్ 27న పెనుకొండలో జరిగే ఏపీ ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రఫీ కోరారు. మంగళవారం పట్టణంలోని తెలుగు తల్లి, గాంధీ సర్కిల్, దర్గా సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, అయ్యప్ప స్వామి గుడి సర్కిల్ , రైల్వే స్టేషన్, వివిధ ఆటో స్టాండ్ సర్కిళ్లలో మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోట్రాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గౌస్ లాజం, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, ఆటో కార్మికుల యూనియన్ నాయకులు వజ్రం నాగప్ప, తిప్పన్న, రెడ్డప్ప రెడ్డి, అంజనప్ప, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.










