ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం జిల్లా ప్రభుత్వ అసుపత్రిని అమరావతికి చెందిన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవా సాగర్, డాక్టర్ సుబ్బరెడ్డితో కూడిన కాయకల్ప బృందం శుక్రవారం తనిఖీ చేసింది. ఈ సందర్బంగా బృందం సభ్యులు అసుపత్రిలోని మాత శిశు విభాగంలో ఉన్నా గర్బిణుల వార్డును తనఖీ చేసి అక్కడ వారికి అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. చిన్న పిల్లల వార్డును తనిఖీ చేసి వార్డులో సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని హెడ్ నర్సులకు సూచించారు. ఎన్‌బిఎస్‌యు వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను పరిశీలించారు. నిత్యం అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు ఆఫ్తాబ్, శ్రీకాంతి, కీర్తిని అభినందించారు. అసుపత్రిలో ఇతర సౌకర్యాలపై వైద్యులు వెంకటరమణ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. పిపి యూనిట్ వైద్యులు ఆనంద్‌బాబు, పద్మజకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాజగోపాల్, ఇతర వైద్యులు, హెడ్‌నర్సులు పాల్గొన్నారు.










