Dec 24,2022 19:49

అభివృద్ధి పనులపై కలెక్టర్‌, ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న ధనుంజయరెడ్డి

ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి
ప్రజాశక్తి - రాయచోటిహొ: అన్నమయ్య జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా పర్యటన సందర్భంగా రాయచోటిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సందర్శించారు. జిల్లా అతిథి గహం పనులు, ఎస్పీ కార్యాలయం, పరేడ్‌ గ్రౌండ్‌, ప్రభుత్వ భవనాల కోసం కేటాయించిన స్థలాలను సందర్శించారు. అనంతరం కలెక్టర్‌ గిరీషా, శాసన సభ వ్యవహారాల సమన్వయకర్త, ఎంఎల్‌ఎ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీష్‌ జిల్లాలో జరుగుతున్న అన్ని అభివద్ధి కార్యక్రమాలను ధనుంజయరెడ్డికి వివరించారు. రాయచోటి-వేంపల్లి రోడ్డు, కొత్త స్టేడియం, ఠాణా నుంచి రింగ్‌ రోడ్డు వరకు 4 లేన్ల రోడ్డు పనులు, మున్సిపల్‌ పనులు, ప్రజారోగ్య సంబంధిత పనులు, నగరవనం, ఎంఐజీ లేఅవుట్లలో రోడ్లు, నీటి వసతి, మౌలిక సదుపాయాల గురించి తెలియజేశారు. నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి, వాటికి సంబంధించిన పెండింగ్‌ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివద్ధికి కలెక్టర్‌, జెసి తమీమ్‌ అన్సారియా, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ హర్షవర్ధన్‌ రాజు విశేష కషి చేశారని అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటయ్యాక ప్రజల ఆకాంక్షలు, అంచనాలు భారీగా పెరుగుతాయని, దానికి అనుగుణంగానే జిల్లా అధికారు యంత్రాంగం పనిచేయాలని సూచించారు. జిల్లా అభివద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో కలెక్టర్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఏవైనా పెండింగ్‌లో ఉన్న పనులు లేదా చెల్లింపులు మొదలైన వాటికి అన్ని రకాల సహాయం అందించబడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి నూతన అన్నమయ్య జిల్లా అభివద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డికి కత్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జిల్లా అభివద్ధికి ఇలాంటి సహకారం అందించాలని ఆయనను కోరారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్త అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాయచోటికి ధనుంజయరెడ్డి వచ్చారని, ఆయన సహాయ సహకారాలతో రాయచోటితో పాటు అన్నమయ్య జిల్లాను త్వరితగతిన అభివద్ధి చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.