Mar 30,2023 20:40

సమావేశంలో మాట్లాడుతున్న బండి సత్యనారాయణ

వీరబల్లి : జీవనోపాదుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా గ్రామీణాభివద్ధి సంస్ధ పథక సంచాలకులు బండి సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సిబ్బంది సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సభ్యులు తీసుకొన్న రుణాలను కచ్చితంగా జీవనోపాధి ఏర్పాటు చేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పథకాలైన వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్నతోడు, వివిధ సంస్థల నుంచి ఇప్పించే రుణాలు సద్వినియోగం చేసుకోనెలా చూడాలన్నారు. రుణాలు 100 శాతం చెల్లించేలా దష్టి పెట్టాలని కోరారు. ఆదివారం స్థానిక జిల్లా పారిషత్‌ హైస్కూల్‌లో జరిగే వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎపియం ఖాదర్‌ వలి, మండల సమాఖ్య సిబ్బంది, గ్రామ సమాఖ్యల సిబ్బంది పాల్గొన్నారు.