Jan 17,2023 21:20

అభినందిస్తున్న పోర్టు సిఇఒ జిజె రావు

అభినందిస్తున్న పోర్టు సిఇఒ జిజె రావు
జీవితంలో భద్రత ఎంతో అవసరం
అదాని కష్ణపట్నం పోర్టు సిఇఒ జిజేరావు వెల్లడి
నెల్లూరు ప్రతినిధి:జీవితంలో ప్రతిరోజూ భద్రతగా ఉండాలని ఆదానికష్ణపట్నం పోర్టు సిఇఒ జిజె రావు వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ భద్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా యువత ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. కారులో ప్రయాణం సాగించే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. మద్యం మత్తు పదార్థాలు సేవించకుండా ప్రయాణం సాగించాలన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ ను పాటించి ప్రయాణం సాగిస్తే ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు. పోర్ట్‌లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భద్రతా చర్యలను పాటించాలని కోరారు.
వారం రోజులుగా కష్ణపట్నం పోర్టులో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోర్ట్‌ కార్మికులు, ఉద్యోగులకు పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలతోపాటు విద్యార్థులకు ఆన్లైన్‌ లో భద్రతపై కాంపిటీషన్స్‌ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.రోడ్డు భద్రతా వారోత్సవాల్లో కోఆర్డినేషన్‌ చేసిన సెక్యూరిటీ విభాగంలో కొందరికి ప్రోత్సాహాలు అందించారు. కార్యక్రమంలో అదాని కష్ణపట్నం పోర్ట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ మోహిత్‌, సెక్యూరిటీ హెడ్‌ వెంకటేష్‌, భాస్కరన్‌, సెక్యూరిటీ డిజిఎం దివ్య ప్రణీత్‌, మనోహర్‌ బాబు, వెంకటేశ్వర్లు, సేఫ్టీ హెడ్‌ రామకష్ణ, షైఫి , నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.