Jul 05,2022 16:07

ప్రజాశక్తి-నందిగామ : ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి  చేస్తోందని నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యా కానుక కిట్లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది - ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతోనే వారికి అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు, వారి పిల్లలకు అవసరమైన స్కూల్ బ్యాగ్స్ -బుక్స్- టై- బెల్టు -షూ లతో పాటు వారికి అవసరమైన అన్ని వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందని, పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ది అని తెలిపారు. అదేవిధంగా జగనన్న గోరుముద్ద పథకం కింద పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందజేయడంతో పాటు ,ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు , ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఇన్చార్జ్ చైర్మన్ , కమిషనర్ ఎస్.జయరాం ఎఇ ఫణి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంబాబు పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఓర్సు  ,కౌన్సిల్ సభ్యులు , విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..