Apr 15,2023 19:39

స్టిక్కర్లు అంటిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -ఉలవపాడు :మండలంలోని భీమవరం గ్రామ సచివాలయం1లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా గృహ సారధులు, కన్వీనర్లు ఇంటింటా తిరుగుతున్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. గృహ యజమానుల అంగీకారంతో స్టిక్కర్లు అంటించారు. భీమవరం వైసిపి నాయకులు చీమకుర్తి కష్ణారెడ్డి, కూనం రవీంద్ర రెడ్డి, వింతా కష్ణారెడ్డి, కాకర్లపూడి లక్ష్మీనారాయణ రాజు, టంకం సురేష్‌ సచివాలయ కన్వీనర్‌ టంకం జ్యోతి గహసారథులు వింతా శివకోటిరెడ్డి, కాకర్లపూడి లక్షీరాధ , కోవూరు చిరంజీవి, వాలంటీర్లు ఫాలవల్లి రాఘవరెడ్డి, పొతకమూరి మణికంఠ పాల్గొన్నారు.