చెక్కును అందజేస్తున్న కలెక్టర్
జగనన్న తోడు పథకంలో
19 వేల మందికి వడ్డీ లేని రుణాలు మంజూరు
నెల్లూరు:జగనన్న తోడు పధకం కింద జిల్లా లోని 19,093 మంది జగనన్న తోడు లబ్దిదారులకు రూ.19.09 కోట్ల మెగా చెక్కును, జిల్లాలోని 30,743 మంది జగనన్న తోడు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ క్రింద రూ. 58.80 లక్షల మెగా చెక్కును పంపిణీ చేశారు. బుధవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుండి జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్. చక్రధర్ బాబు,జడ్‌పిచైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, శాసన మండలి సభ్యులు బల్లి కల్యాణ్ చక్రవర్తి, ముస్లీం సంచార జాతుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సయ్యద్ ఆసిఫా, డి.ఆర్.డి.ఎ పిడి సాంబశివారెడ్డి, మెప్మా పిడి రవీంద్ర, జగనన్న తోడు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలైన చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వత్తుల వారికి అండగా వుంటూ, వారికి ఉపాధికి ఉతమిస్తూ వారు స్వావలంబన సాధించేలా జగనన్న తోడు పధకం ద్వారా ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జగనన్న తోడు పధకం కింద జిల్లా లోని 19,093 మంది జగనన్న తోడు లబ్దిదారులకు రూ.19.09 కోట్ల మెగా చెక్కును, జిల్లాలోని 30,743 మంది జగనన్న తోడు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ క్రింద రూ.58.80 లక్షల మెగా చెక్కును అందచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమం ద్వారా అన్నీ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. జిల్లాలో జగనన్న తోడు పధకం కింద మొత్తం 6 విడతల్లో ఒకొక్క లబ్ధిదారుడికి రూ. 10 వేల చొప్పున 1,39,999 మందికి రూ.139.99 కోట్ల చిరు వ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు. జగనన్న తోడు పధకం కింద 6వ విడత కింద జిల్లాలో మొత్తం 19,093 మంది పేద చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.19.09 కోట్ల మేరకు రుణ సహాయాన్ని అందజేశామన్నారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన 30,743 మంది జగనన్న తోడు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ క్రింద రూ. 58.80 లక్షల చెల్లిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అర్హులైన చిరు వ్యాపారస్తులను గుర్తించి ఈ పధకం అమలుకు సహకరించిన జిల్లా గ్రామీణాభివద్ది సంస్థ, మెప్మా సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తీసుకున్న రుణాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివద్ధి సాధించాలని లబ్దిదారులకు సూచించారు










