హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చారని నియోజక వర్గ ఇన్‌ఛార్జి షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. పట్టణంలోని 19వ వార్డులో శనివారం చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఇక్బాల్‌కు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజతో పాటు వార్డు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ పథకాలు, జగనన్న సురక్ష పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జబివుల్లా, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు లోకేష్, కౌన్సిలర్లు నాగేంద్రబాబు, మల్లికార్జున, రహమత్‌బి, అయూబ్, రోషన్ అలి, బాబు, వెంకటేష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సచివాలయ కన్వీనర్, గృహ సారథులు పాల్గొన్నారు.










