అవగాహన కల్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -రాపూరు :సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పథకం జగనన్న సురక్షపై గురువారం కంబాలపల్లి, రాపూరు-2 సచివాలయంలో సచి వాలయం కన్వీనర్లు, గహ సారధులు, గ్రామ వలంటీర్లకు, రాపూరు మండలం బిఎల్‌ఒలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ భూపతి జయమ్మ,వైకాపా నాయకులు ఏపూరు సుబ్బారెడ్డి బొమ్మిరెడ్డి వెంకట రమణారెడ్డి,బత్తిన సంజీవరెడ్డి, పంచా యతీ కార్యదర్శి ప్రభాకర్, చెల్లటూరు రమణారెడ్డి,ప్రసాద్ రెడ్డి ఉన్నారు.










