ప్రజాశక్తి-రాయచోటి
ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టిం దని, ఈ కార్యక్రమంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సురక్ష కార్యక్రమంపై సంబందిత అధికారులతో జెసి విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభమై జులై 23వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంపై సచివాలయం, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరు ఛాలెంజ్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఏ సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికేట్ లు ప్రభుత్వ పధకాల సమస్యలు ఉంటె వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ పనుల నిర్వహణ కోసం మండల అధికారులు ఎక్కడికక్కడా క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిం చాలన్నారు. మండల స్థాయిలో ఎంపిడిఓ, డిప్యూటి తాహశీల్దార్ ఒక బందంగా, ఎంఆర్‌ఒ, ఇఒపిఆర్‌డి మరో బందంగా, పురపాలక సంఘాల స్థాయిలో కమిషనర్ నేతత్వంలో ఒక బందంగా వారి పరిధిలోని గ్రామాలు, వార్డుల్లో పర్యటించాలన్నారు. ఏ సచివాలయం పరిధిలో ఏ తేదీలో పర్యటిస్తారో ముందే నిర్ణయించి ఆ తేది నాటికల్లా సచివాలయ పరిధిలో సిబ్బంది అవసరమైన మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికేట్లు, ప్రభుత్వ పధకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండల స్థాయిలో శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, భాష్కర్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్ధార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్










