Jun 17,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని జిల్లాలో ప్రణాళిక బద్ధంగా విజయవంతం చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి నారాయణ భరత్‌ గుప్తాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 'జగనన్న సురక్ష' కార్యక్రమం అంశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమానికి రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌, జెసి ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 23న ముఖ్యమంత్రి 'జగనన్న సురక్ష' యాప్‌ను విసి ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్‌ 24 నుంచి 30 వరకు పట్టణ, గ్రామ వార్డులలో వాలంటీర్‌ గహ సారధులు ఇంటింటికి వెళ్లి కార్యక్రమం పై అవగాహన కల్పించి ప్రచారం నిర్వహించడంతోపాటు ప్రజా సమస్యలను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని డివిజన్‌ స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయిలో పర్యవేక్షణ చేయడానికి అధికారుల బందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్‌ సారథ్యంలో జిల్లాస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి యాప్‌ను ప్రారంభించిన అనంతరం వారం పాటు వాలంటీర్‌ గహ సారధులు ఇంటింటికి వెళ్లి అమలవుతున్న పథకాలకు సంబంధించి పౌరులతో చర్చించి సమస్యలను గుర్తించి వాటిని నమోదు చేసుకొని, సదరు వివరాలను సంబంధిత డిజిటల్‌ అసిస్టెంట్లకు ఇవ్వాలన్నారు. ఆయా సమస్యలపై డిజిటల్‌ అసిస్టెంట్లు ఈ సర్వీస్‌ ద్వారా తప్పనిసరిగా సర్వీస్‌ రిక్వెస్ట్‌ నమోదు చేయాలన్నారు. తహశీల్దార్‌, ఎంపిడిఒ ఆధ్వర్యంలో రెండు బందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జులై1 నుంచి 22 వరకు సదరు రెండు బందాలు వారికి కేటాయించిన ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించాలని చెప్పారు. ప్రతి టీం వారంలో మూడు రోజులు మాత్రమే క్షేత్రస్థాయిలో పర్యటించి, సచివాలయాలను సందర్శించాలని సూచించారు. డివిజన్‌ స్థాయిలో ఆయా ఆర్డీవోలు కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ జిల్లా కో -ఆర్డినేటర్‌ మనోహర్‌ రాజు, డిపిఒ ధనలక్ష్మి, జడ్‌పి కో- ఆర్డినేటర్‌ రమణారెడ్డి, డిఎస్‌ఒ రఘురాం, సిపఒ కష్ణా నాయక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.