జగనన్న రాగిజావ ప్రారంభం
ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న గోరుముద్ద మార్పులో భాగంగా చేర్చిన రాగిజావను ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్, ఎంఇఒ షేక్ మస్తాన్ వలీ, సర్పంచ్ సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఎంపిటిసి సయ్యద్ సుభాన్ ప్రారంభించారు. మంగళవారం మండల పరిధిలోని దాసరిపల్లి, ఎంపిడిఒ కార్యాలయం ఆవరణంలోని దళితవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో జగనన్న రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేస్తున్న రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు జగనన్న రాగిజావ మంచి పౌష్టికాహారం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా చదువు కోవడానికి దోహదపడుతుందన్నారు. అనంతరం దాసరపల్లి ఎంపిటిసి సుభాన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రారంభిన కార్యక్రమానికి 200మంది విద్యార్థులకు జగనన్న రాగిజావ కొరకు గ్లాసులు వితరణ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ గాజుల ఫారుఖ్ అలీ, ఖలీల్, రామకృష్ణ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ ఖాజామోహిద్దీన్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










