Apr 02,2023 21:05

విద్యుత్‌ ఉపకేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేస్తు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

 రాయచోటి : జగనన్న పాలనలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందని అన్న మయ్య జిల్లా వైసిపి అధ్యక్షలు, ఎమ్మెల్యే గడికోటగ శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబేపల్లె మండలం గుట్టపల్లెలోని అంకిరెడ్డిగారిపల్లె, దళితవాడ, గుదియ వాండ్లపల్లెలలో డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ ఉదరు కుమార్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, సర్పంచ్‌ పాల వెంకటరమణ నాయుడు లతోకలసి శ్రీకాంత్‌ రెడ్డి గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పల్లెల్లో ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ, అభివద్ధి పథకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు . మరింత మెరుగైన పాలన సాగించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ మూడన్నరేళ్ల కాలంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా నెరవేర్చారన్నారు. మరింత మెరుగ్గా పాలన అందిస్తామని, ఇందుకు ప్రజల సహకారం, సూచనలు, సలహాలు అందివ్వాలని కోరారు. కార్య క్రమంలో తహశీల్దార్‌ మహేశ్వరి భాయి, ఎంపిడిఒ నరసింహులు, మండల వ్యవసాయ సలహా అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, సర్పంచులు రఘునాథ రెడ్డి, అమరనాధ రెడ్డి, దండు నాగభూషన్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవపట్ల వెంకట్రామిరెడ్డి, ఎంపిటిసి శ్రీధర్‌ రెడ్డి, మీసాల ఆంజనేయులు, రాళ్లపల్లె రవీంద్ర నాయుడు,కంబెల్ల ఆంజనేయులు, సహదేవ నాయుడు,ఉమా కుమార్‌, మోహన్‌ రెడ్డి,హేమసుందర్‌, వెంకట సిద్దారెడ్డి, అన్నారెడ్డి, వసంత శ్రీనివాసులు రెడ్డి, శెట్టిపల్లె యర్రపురెడ్డి బ్రహ్మానందరెడ్డి, లక్ష్మీకర్‌ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రమణారెడ్డి, వాయల్పాటి ఆనంద కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి శివయ్య, డిసిఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ బుల్లి వెంకట రమణ, శివారెడ్డి, గురిగింజకుంట అమరనాధ రెడ్డి పాల్గొన్నారు.
మౌలిక వసతులతో జగనన్న కాలనీని తీర్చిదిద్దుతాం
రాయచోటి టౌన్‌ : మౌలిక వసతుల కల్పనతో ఆదర్శ కాలనీగా నారా యణరెడ్డిగారిపల్లె జగనన్న కాలనీని తీర్చిదిద్దుతామని వైసిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న నారాయణరెడ్డి గారిపల్లె జగనన్న కాలనీలో 33/11 కె వి విద్యుత్‌ ఉపకేంద్ర నిర్మాణపు భూమిపూజలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదల కోసం సుమారు 6500కు పైగా నారాయణరెడ్డిగారిపల్లె జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. పట్టణానికి చుట్టు పక్కల పదివేల ఇళ్లకు పైగా జగనన్న కాలనీలలో నిర్మిస్తున్నారని చెప్పారు. నారా యణరెడ్డిగారిపల్లె జగనన్న కాలనీలో భూగర్భ డ్రెయినేజీ, విద్యుత్‌ తదితర మౌలిక వసతులును కల్పించడం కల్పిస్తామన్నారు. సబ్‌ స్టేషన్‌ నిర్మాణపు పనులను త్వరితగతిన చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాష, వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, మాజీ జడ్‌పిటిసి గొర్ల ఉపేంద్రా రెడ్డి, మండల కన్వీనర్‌ ఉదరు కుమార్‌ రెడ్డి, విద్యుత్‌ ఇఇ చంద్రశేఖర్‌ రెడ్డి, వైసిపి సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్‌ ఖాన్‌ సర్పంచ్‌ పూజల అలివేలమ్మ, ఎంపిటిసి రఘు, నియోజక వర్గ బిసి సెల్‌ కన్వీనర్‌ నాగరాజు యాదవ్‌ పాల్గొన్నారు.