లే అవుట్లను పరిశీలిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి - వెంకటాచలం :జగనన్న కాలనీలో నిర్మిస్తున్న గహ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మండల ప్రత్యేక అధికారి ఉషారాణి పేర్కొన్నారు. మండలంలోని నిడి గుంట పాలెం, గుడ్లూరి వారి పాలెం, పూడిపర్తి గ్రామాలలో శనివారం ఆమె జగనన్న లేఅవుట్లను పరిశీలించారు.ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులు ఉగాది నాటికి గహాలు పూర్తిచేసుకుని గహప్రవేశాలు చేసుకునే విధంగా ప్రయత్నిం చాలన్నారు. హౌసింగ్ ఎఈ వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ ఎఇ అనిల్ వర్క్ ఇన్స్పెక్టర్ అక్మల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.










