Mar 04,2023 21:08

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌
జగనన్న కాలనీ పనులు త్వరితగతిన పూర్తి
నెల్లూరు:
నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గహ వసతి కల్పించే దిశగా రూపొందిస్తున్న జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన గహాలను ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ హరిత ఆదేశించారు. శనివారం ''హౌసింగ్‌ డే'' ను పురస్కరించుకుని స్థానిక వెంకటేశ్వరపురం భగత్‌ సింగ్‌ కాలనీ ప్రాంతంలోని జగనన్న కాలనీ నిర్మాణ పనులను అధికారులతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గహాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ అమెనిటీస్‌ కార్యదర్శులు లే అవుట్ల నిర్మాణ పనులు, అభివద్ధి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యుత్తు, వీధి దీపాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది నాటికి లబ్ధిదారులకు గహాలను కేటాయించాలని కమిషనర్‌ సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జమీర్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ డి.ఈ దయాకర్‌, అధికారులు, సచివాలయ వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.