జగనన్న ఇళ్లను వేగవంతం చేయాలి
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలంలో జరుగుతున్న జగనన్న కాలనీ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ పిడి వెంకటదాస్ పేర్కొన్నారు. బోగోలు మండలం బిట్ 1, బిట్ 2లోని జగనన్న కాలనీలలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను శుక్రవారం ఆకస్మితంగా తనిఖీ చేసి, గృహ నిర్మాణ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ పిడి వెంకటదాస్ మాట్లాడుతూ మండలంలో జగనన్న లే అవుట్‌లో నిర్మిస్తున్న వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించామని, బోగోలు దళితవాడలో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించామని, గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించామన్నారు. కార్యక్రమంలో మండల గృహ నిర్మాణశాఖ అధికారి వెంకటయ్య, బోగోలు పంచాయితీ కార్యదర్శి జయలక్ష్మి, అసిస్టెంట్ ఇంజనీర్ అజరు కుమార్, పొదుపు బిఎఒలు, వాలంటీర్లు, స్థానికులు పాల్గొన్నారు.










