Jan 17,2023 20:34

ఇళ్ల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న మంత్రి

ప్రజాశక్తి -వెంకటాచలం :అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన వెంకటాచలం సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయలనే లక్ష్యంతో ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. ప్లాట్లు మంజూరైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను మంత్రి అందజేశారు.ఎంపిడిఒ సుస్మిత, తహశీల్దార్‌ నాగరాజు, మాజీ జెడ్‌పిటిసి మందల వెంకట శేషయ్య, గహ నిర్మాణ శాఖ పి డి వెంకటదాస్‌ ఉన్నారు.