Dec 23,2022 20:11

నత్తనడకన సాగుతున్న జగనన్న గృహ నిర్మాణాలు

నత్తనడకన సాగుతోన్న నిర్మాణాలు
35 శాతం మాత్రమే పూర్తిహొ
ప్రజాశక్తి - రాయచోటి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న పక్క గృహాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 73,756 గృహాలు మంజూ రయ్యాయి. గృహాలు వేగవంతం చేయాలని వారంలో రెండు, మూడు రోజులు రాష్ట్ర గృహ శాఖ నుంచి సమీక్షలు నిర్వహించినా పనుల్లో వేగం కనిపిం చడం లేదు. గహ నిర్మాణ శాఖ కాకుండా, ఇతర శాఖను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించి నియమించారు. ఇతర శాఖ వారు బాధ్యతగా విధులు నిర్వహి స్తున్నప్పటికీ, గహ నిర్మాణ శాఖలో ఆ బాధ్యతను గాలికి వదిలేస్తున్నారుని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. 35 శాతం మాత్రమే పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 496 లే అవుట్లు ఏర్పాటు చేశారు. లేఓట్లు, ఇతర 8182 గహాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో బిలో బేస్‌ మెట్‌ లెవెల్‌ 22, 824, పునాదులు 21,084, గోడలు 7,093, స్లాబులు 7,9 46 వివిధ దశలలో నత్తనడకన సాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వమే ఒక గహానికి రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. పైగా 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు సిమెంటు ఒక బస్తా ధర రూ.229లతో 90 బస్తాలను, స్టీల్‌ కేజీ రూ.66లతో 480 కిలోల స్టీల్‌ను తక్కువ రేట్లతో లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ లబ్ధిదారులు గహాలు వేగవంతం కావడం లేదంటే గహ నిర్మాణ శాఖ వారు లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించకపోవడమే లోపమని పలువురు చర్చించుకుంటున్నారు. డిసెంబర్‌ చివరి నాటికి 23 వేల గహాలు పూర్తి కావాలని లక్ష్యంకాగా జిల్లాలో ఇప్పటి వరకు 8,182 పక్కా గహాలు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన గహాలు పూర్తి చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందో వేచిచూడాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గహ నిర్మాణ శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుని లక్ష్యాన్ని పూర్తి చేస్తారో వేచి చూడాలి.
వేగవంతం చేస్తాంహొ
జిల్లాలో జగనన్న గహాల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నాం. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా 3వ స్థానంలో ఉంది. మండల హౌసింగ్‌ ఇంజినీర్‌తో సమీక్ష సమావేశాల్లో కూడా నిర్వహిస్తున్నాం. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- శివయ్య, హౌసింగ్‌ పీడీ, రాయచోటి.