ప్రజాశక్తి - రాయచోటి : జగనన్న చేదోడు పథకం మూడో ఏడాది కింద అన్నమయ్య జిల్లాలోని 12,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 12,55,10,000 జమ చేశామని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా, వినుకొండ నుంచి ''జగనన్న చేదోడు పథకం' మూడో ఏడాది కింద లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసే బహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి సందప్ప, విఎస్ డబ్ల్యుఎస్ ఎఒ మనోహర్‌రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఏటా రూ.10 వేలు చొప్పున అందజేస్తున్నారని చెప్పారు. లబ్ధిదారులు తమ ఆదాయ వనరులను పెంచడానికి, ఇతర నిత్యావసరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. ఇది వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి కూడా సాయపడుతుందని చెప్పారు. అనంతరం జగనన్న చేదోడు పథకం సంబంధించిన మెగా చెక్కును జెసి చేతుల మీదగా టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి దున్నిపాడు రవిరాజు, ఎస్‌డబ్ల్యూఒ కష్ణయ్య, అధికారులు, టైలరు,్ల రజకలు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.










