మాట్లాడుతున్న నాయకులు
జగనన్న ఆరోగ్య సురక్ష
క్యాంపులను విజయవంతం చేయండి
ప్రజాశక్తి-కోవూరు:జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను విజయవంతం చేయాలని సచివాలయాల కన్వీనర్ కవరిగిరి ప్రసాద్ తెలిపారు. మండలంలోని పాటూరు సచివాలయం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులో ఉండాలనే ఆశయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మారుమూల పల్లెలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వ్యాధులకు రక్త పరీక్షలు మందులు అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన సౌకర్యాలు కల్పించి అభివద్ధి చేశారన్నారు. వేసవికాలంలో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు చూసి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు ఏసీలను అందజేసి పేద ప్రజల పట్ల తన దాతత్యాన్ని చాటుకున్నారని తెలియజేశారు.










