కరువు కదిరి టౌన్ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని టిడిపి నాయకులు, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ విమర్శించారు. బుధవారం పట్టణంలోని కందికుంట వెంకటప్రసాద్ స్వగృహంలో తెలుగుదేశ పార్టీ మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కదిరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, ఖాదర్ బాషా, కదిరి నియోజవర్గ మైనార్టీ అధ్యక్షులు బావవలి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లింలకు రక్షణ కరువైందన్నారు. ముస్లింల పక్షపాతి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వారికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మైనార్టీల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ మునవర్ అలీ ఖాన్, హైదర్, షానవాజ్, బషీర్, తెలుగు యువత నాయకులు రోషన్, సిరాజ్, చాంద్‌బాషా, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.










