Dec 29,2022 19:49

'ఇదేం ఖర్మ'లో సమస్యలు నోట్‌ చేసుకుంటున్న రమేష్‌రెడ్డి

ప్రజాశక్తి - రాయచోటిహొ: మన రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి పట్టణం మూడవ వార్డులో మన రాష్ట్రానికి ఇదేమిఖర్మ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టారు. ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలు అధికారం కట్టబెడితే ప్రజలపై భస్మాస్మరుని మాదిరిగా చేయి పెట్టారని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తగ్గించిన ధరలు ఏమీ లేవన్నారు ప్రజల ఆశ ఆశయాలు నీరుగారి పోయాయన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా వైసిపి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అనంతరం మూడో వార్డులో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. పట్టణంలో అత్యధికంగా ముస్లిమ్‌ మైనార్టీలున్నారని, వారిని ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, టిడిపి పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి, ఆసుపత్రి అభివద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ హుస్సేన్‌, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అతావుల్లా, టిడిపి నేతలు మైనుద్దీన్‌, జావిద్‌, జాబీర్‌ సత్యారెడ్డి, మాబు అలీ, ఇలియాజ్‌,ఇనాముల్లా, మహమ్మద్‌ జాఫర్‌, వతన్‌ నిస్సార్‌, లక్ష్మీ ప్రసాద్‌ న్యూ ఆంధ్ర ముబారక్‌, షబ్బీర్‌ ఆహ్మద్‌, సయ్యద్‌ పజిల్‌, హాజీ, రామక్రిష్ణ గౌడ్‌, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.