Dec 24,2022 21:43

ఫొటో : ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్న జెవివి నాయకులు

జెవివి ఆధ్వర్యంలో గుడ్డ సంచుల పంపిణీ
ప్రజాశక్తి-కావలి : పట్టణంలోని రైతు బజార్‌ వద్ద కావలి పట్టణ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పర్యావరణ పరి రక్షణలో భాగంగా ఎల్‌.గుణశేఖర్‌ రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో గుణశేఖర్‌ రెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఉచిత గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు డాక్టర్‌ బెజవాడ.రవికుమార్‌, తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఇదే స్థలంలో జెవివి ఉచితంగా గుడ్డ సంచులు అందజేసినట్లు తెలియజేశారు. కావలి జెవివి పట్టణ శాఖ తరపున గుణశేఖర్‌ రెడ్డి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈ సంచులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కనీసం 10 పదిమందికి స్వచ్ఛమైన పర్యావరణ పట్ల అవగాహన కలుగజేసి, తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
రాబోయే తరాలకు ఈ తరం వారు అందించే కానుక ''ఒక్క స్వచ్ఛమైన పర్యావరణం'' మాత్రమే అని అన్నారు. అదేవిధంగా మళ్లీ కరోనా వైరస్‌ కొత్తరకం వేరియంట్‌ బి.ఎఫ్‌-7 విజృంభిస్తూ, ప్రపంచాన్ని వణి కిస్తున్నందున మళ్లీ ప్రజలందరూ మాస్కులు ధరించి, కోవిడ్‌-19 నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెవివి కావలి పట్టణ కమిటి కార్యదర్శి గాదిరెడ్డి.హరినాథ్‌, కోశాధికారి టి.సుబ్బరామశర్మ, ఉపాధ్యక్షులు పాపిశెట్టి.జానకిరామ్‌ (జిల్లా కార్యదర్శి), ఆకుల.రమణయ్య (జిల్లా ట్రెజరర్‌), కందికట్టు.నారాయణ, సహాయ కార్యదర్శులు షేక్‌ ఖాదర్‌బాషా, శ్రీకర్ల.వెంకయ్య, కార్యవర్గ సభ్యులు జి.కళ్యాణి, సిహెచ్‌.శారద, యుటిఎఫ్‌ నాయకులు బి.శ్రీదేవి, పొన్నగంటి.మాధవ, బ్రహ్మయ్య, ట్రస్ట్‌ సభ్యులు సంపత్‌ కుమారి, స్నేహలత, భారతి, జెవివి సభ్యులు కర్నాటి.సుబ్బారావు, గాదిరెడ్డి.మురళీకృష్ణ, దామిశెట్టి.సురేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.