జెండాను ఆవిష్కరిస్తున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి
జెండా ఆవిష్కరణ
బుచ్చిరెడ్డిపాళెం:అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ సందర్భంగా బుచ్చిరెడ్డి పాలెం మండలం, దామరమడుగు గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ జెండా ఆవిష్కరణలో రైతు సంఘ జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య పాల్గొని నినాదాలు ఇచ్చారు. ఈ దేశంలో రైతులని ఇతర సంస్థలను ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ జెండా ఎగరేసి నినాదాలు చేశారు. ఈ పోరాటాన్ని ఇంకా రాబోయే రోజుల్లో కొనసాగించి రైతులకి రైతుల ఇబ్బందుల నుంచి కాపాడే దానికి ఈ రైతు సంఘం కషి చేస్తుందన్నారు. రైతుల సమస్యలను కాపాడేందుకు ఎపి రైతు సంఘం బుచ్చిరెడ్డి పాలెం మండల కమిటీ అన్ని శాఖలు కూడా రైతులకు అండగా ఉండి రైతుల సమస్యలపై పనిచేయాలని రైతు సంఘం కోరుకుంటుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గండవరపు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










