Apr 04,2021 10:23

కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడి తురుము - 4 కప్పులు, పంచదార - 4 కప్పులు, కారం- టీ స్పూను, వేగించిన జీలకర్ర పొడి - టీ స్పూను, యాలుకుల పొడి - అర టీస్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - చిటికెడు, (ఇష్టమైతే) నెయ్యి - టీ స్పూను.
తయారుచేసే విధానం : పాన్‌లో మామిడి తురుము, పంచదార వేసి చిన్న మంటపై తిప్పుతుండాలి. మిశ్రమం సగానికి సగం అయ్యాక జీలకర్ర పొడి, పసుపు, యాలుకుల పొడి, కారం, ఉప్పు వేసి మరింత చిక్కబడే వరకూ కలపాలి. చివర్లో నెయ్యి వేసి దించేయాలి. అంతే పసందైన పచ్చిమామిడి జెల్లీ రెడీ.. ఇది పరాటా / బ్రెడ్‌లతో తినడానికి రుచిగా ఉంటుంది.