జెజెఎం పథకం ద్వారా తెల్లగుంటకు నీరు
ప్రజాశక్తి బిట్రగుంట : జల జీవన్ మిషన్ పథకం ద్వారా తెల్లగుంట గ్రామానికి శాశ్వత నీటి సరఫరాను అందిస్తున్నట్లు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని అల్లిమడుగు గ్రామపంచాయతీ తెల్లగుంట గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా తాగు నీటి పైప్ లైన్‌కు శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తెల్లగుంట గ్రామంలో నీరు లేక చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, జెజెఎం ద్వారా రూ.33 లక్షలు, ఎంఎల్‌ఎ నిధుల ద్వారా రూ.3 లక్షలతో శాశ్వత నీటి పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. మండలంలో రెండో కారుకు నీటిని అందించేందుకు జిల్లా నీటి అధికారులతో మాట్లాడి ప్రతిఒక్క రైతుకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మండలం కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, మేకల శ్రీనివాసులు, గండూరి శ్రీను, పెండ్లి వెంకటేశ్వర్లు, తోటపల్లి సాగర్, షమీవుల్లా, ఏకే సుందర్ రాజ్, నాయబ్ రసూల్, ఉమామేశ్వరపురం సర్పంచ్ సావిత్రి, సీనియర్ నాయకులు, టి.పెంచలయ్య, తుమ్మల రమణయ్య, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










