నివాళి అర్పిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -గుడ్లూరు :మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గుడ్లూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెయిన్ బజార్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహనికి సోమవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తూరి.శ్రీనివాసులు, ట్రెజరీ ఇన్నమురి.గరటయ్య, సెక్రటరీ అమర.మాల్యాద్రి, శ్రీరామ సేవసమితి సభ్యులు ఎయిర్టెల్ చిన్న, ఇన్నమురి.ప్రమిలసూధకర్, గొల్ల.రాజా, రాంబాబు ,మానం శ్రీనివాసులు, గ్రామ మాజీ సర్పంచి మేకపోతుల.రాఘవులు పాల్గొన్నారు.










