ప్రజాశక్తి-కురబలకోట : మదనపల్లె మిట్స్ కళాశాలలో బి.టెక్ మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ పోటీలలో ప్రతిభ కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. కడపలోని కెఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జాతీయ స్థాయీ టెక్నికల్ ఫెస్ట్‌లో కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతులు పొందినట్లు తెలిపారు. మూడవ సంవత్సరం చదువుతున్న ఆర్.మణికంఠ, సందీప్ కుమార్, మణి తేజ,షేక్ సమీర్ క్రాంక్ లీవెర్ మెకానిజంతో బహుళ ప్రయోజన స్ప్రే పరికరంకు ఈ బహుమతులు లభించిందని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, రూ.2 వేలు క్యాష్ ప్రైజ్‌ను అందజేశారన్నారు. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది పోటీపడిన ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ ముప్పా లక్ష్మణ రావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేసారు










