Dec 29,2022 19:07

భారీ ఇనుప ఖనిజంతో చైనా బయలుదేరిన షిప్‌

ప్రజాశక్తి -నెల్లూరు : ఎంవి.ఎన్‌.ఎస్‌. హైరున్‌ గురువారం తెల్లవారు జామున విజయ వంతంగా కష్ణపట్నం ఓడరేవు పరిమితుల నుంచి చైనాకు బయలు దేరింది. ఆ క్షణం కష్ణపట్నం ఓడరేవు రికార్డులలోనే కాకుండా భారతదేశ సముద్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో చరిత్ర తిరగరాసినట్లయిందని పోర్టు వర్గాలు తెలిపాయి భారతీయ సముద్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా గరిష్టంగా 17.85 మీటర్ల డ్రాఫ్ట్‌ పూర్తిగా లోడ్‌ చేయబడిన కేప్‌ సైజర్‌ షిప్‌ 168100 ఎమ్‌టి టన్నుల ఇనుప ఖనిజాన్ని లోడ్‌ చేసిన తర్వాత బయలుదేరింది. ఇది భారతీయ ఓడరేవుల నుంచి ఇప్పటివరకు ప్రయాణించిన అత్యంత లోతైన డ్రాఫ్ట్‌.
అరుదైన ఘనత
కష్ణపట్నం ఓడరేవు సూపర్‌ ఎఫెక్టివ్‌ టీమ్‌కు బోలెడంత ప్రశంసలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త శిఖరాలను చేరుకోవడానికి అద్భుతమైన నిబద్ధత ఫలితాలను చూపించింది. కష్ణపట్నం ఓడరేవు బందం కషి , అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎం.వి. ఎన్‌.ఎస్‌ హైరున్‌ 23 డిసెంబర్‌ 2022 ఓడ సురక్షిత బెర్త్‌ కోసం ప్రణాళికను రూపొందించారు. తర్వాత 17.85 మీటర్స్‌, డ్రాఫ్ట్‌ , 168100 ఎమ్‌టి ఐరన్‌ ఓర్‌ లోడుతో ప్రయాణించిన తర్వాత బెర్త్‌ చేశారు. ఈ ప్రణాళికను మెరైన్‌ బందం విజయవంతంగా అమలు చేసింది. ఎన్‌పి కెప్టెన్‌. పాధి , కెప్టెన్‌ బిభూపాద సాహూ నిపుణుల మార్గదర్శకత్వంలో పోర్టు సిఇఒ జిజె రావు, సిఒఒ సంజోరు కోథా తదితరులు నిబద్ధతతో వ్యవహ రించారు. ఈ ల్యాండ్‌ మార్క్‌ కష్ణపట్నం ఓడరేవు ఖ్యాతిని జాతీయ స్థాయిలో పెంచింది. మొదటి భారతీయ ఓడరేవుగా అత్యున్నత స్థాయికి చేర్చింది.