Jan 23,2023 18:55

మాట్లాడుతున్న షేక్‌ మహమ్మద్‌ రఫీ

ప్రజాశక్తి -కందుకూరు :34వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం పట్టణంలోని గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో రహదారి భద్రత మీద అవగాహనా సదస్సు జరిగింది.కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి షేక్‌ మహమ్మద్‌ రఫీ కళాశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వాహనమును నడుపుచున్న సమ యంలో అప్రమత్తతతో ఉండాలన్నారు. డ్రైవింగ్‌ చేస్తే మీరు మీ వాహనముతో పాటుగా ఎదుటి వాహన చోదకులు, పాదాచారులు క్షేమంగా ఉండాలన్నారు. ప్రాణము ఎంతో విలువైనదని అందుచేత ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారినపడకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్‌ కె. మస్తానయ్య, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.