Jan 21,2023 18:25

మాట్లాడుతున్న ఎంవిఐ షేక్‌ మహమ్మద్‌ రఫీ

ప్రజాశక్తి -కందుకూరు :జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా శనివారం కందుకూరు ఆర్‌టిసి గ్యారేజీలో బస్సు డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, హెల్పర్లు, ఆటో డ్రైవర్లకు రోడ్‌ భద్రతపై అవ గాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మోటారు వాహనాల తనిఖీ అధికారి షేక్‌ మహమ్మద్‌ రఫీ మాట్లాడారు. ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లద్దొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని తెలియచేసారు. ఆర్‌టిసి డిపో మేనేజర్‌ కె పెద్దన్న శెట్టి మాట్లాడుతూ నూటికి 80శాతం ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలవల్లే జరుగుతున్నాయన్నారు. వాహనం నడుపు సమయంలో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు.కందుకూరు ప్రజా వైద్యశాల సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డా. యండి షాజాఉద్దిన్‌, కందుకూరు టౌన్‌ ఎస్‌ఐ పి . ఎల్‌ . ప్రసాద్‌, రవాణా శాఖా సిబంది పాల్గొన్నారు.