Apr 24,2023 19:43

మాట్లాడుతున్న సర్పంచ్‌ ఆవుల మాధవరావు

ప్రజాశక్తి -కందుకూరు కోవూరు గ్రామ సచివాలయంలో జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఆవుల మాధవరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సర్పంచ్‌ మాధవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మానస పుత్రిక అయినటువంటి సచివాలయ వ్యవస్థ గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ సచివాలయం వాలంటరీల ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అని అన్నారు. గ్రామస్థాయిలో వివిధ శాఖల సేవలను ప్రజలకు అందుబాటులో గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఎంఎల్‌ఎల మానుగుంట మహీధర్‌ రెడ్డికీ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి స్వప్న, వీఆర్వో సతీష్‌, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు.