Jan 01,2023 19:41

జంబోరీకి ఎంపికన విద్యార్థులు

ప్రజాశక్తి - రాయచోటి : రాజస్థాన్‌లో ఈ నెల 4 నుంచి 10 వరకు నిర్వహించబోయే 18వ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జాతీయ జాంబోరీ సమ్మేళనానికి కడప నుంచి 80 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం కడప శంకరాపురంలోని స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా తరఫున పాల్గొనే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్కౌటింగ్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఉత్తమ ప్రదర్శనలు కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ట్రెజరర్‌ రమణయ్య, ఎఎస్‌ఒ సి. లక్ష్మికర్‌, స్కౌట్‌ మాస్టర్లు ఖాదర్‌ బాషా, బాలసుందరం, గైడ్‌ కెప్టెన్‌ జయలక్ష్మి పాల్గొన్నారు.