Feb 07,2023 21:13

అన్నమయ్య ప్రాజెక్ట్

కడప ప్రతినిధి : అన్నమయ్య రిజర్వాయర్‌ పునరు ద్దరణకు జాప్యం తప్పడం లేదు. గత నెల 17న రివర్స్‌టెండర్‌ నిర్వహణకు జిల్లా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 రోజులకుపైగా పరిశీలన చేస్తున్నామనే పేరుతో కాలయాపన చేయడంలోని మతలబేమిటో తెలి యడం లేదు. 2021 నవంబర్‌ 19, 20 తేదీల్లో జవాద్‌ తుఫాన్‌ ధాటికి అన్నమయ్య మట్టికట్ట పూర్తిగా తెగడంతో నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు అన్నమయ్య పునద్ధరణకు సంబంధించిన సాంకేతిక అంశాల నివేదికను ఇరిగేషన్‌ విజయవాడకు చెందిన హైడ్రాలజీ, డిజైనింగ్‌, గేట్ల పెంపు, నీటి విడుదల సామర్య్త పెంపు వంటి ఇతర విభాగాలకు సంబం ధించిన ఇంజినీరింగ్‌ నిపుణులు పలుమార్లు పరిశీలించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేక వడపోతల ఓ ప్రయివేటు ఏజెన్సీ సహా యంతో ప్రతిపాదనలు తయారు చేయించారు. 100 ఏళ్లలో ఏటా బహుదాకి వచ్చే వరద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభు త్వం గత ఏడాది డిసెంబర్‌ మూడవ తేదీన జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఇంజినీరింగ్‌ యంత్రాంగం గత డిసెంబర్‌ మూడవ వారంలో టెండర్లు పిలిచింది. ఇందులో రాఘవ, రాజరాజేశ్వరి కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనడం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 17న రివర్స్‌ టెండర్లను నిర్వహించనున్నట్లు పేర్కొనడం తెలిసిందే. కానీ జనవరి 17 నుంచి నేటి వరకు రివర్స్‌టెండరింగ్‌ దశను దాటలేదు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం సిఒటి విభాగానికి పంపించాల్సి ఉన్నట్లు సమా చారం. సిఒటి ఆమోదం అనంతరం ఎంపికైన సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుని పనుల్ని గ్రౌండింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్న మయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పరిశీలనకు ఏడాదికిపైగా సమయం తీసుకుంది. టెండర్ల నిర్వహణకు నెలల తరబడి సమయం తీసు కుంటే నిర్మాణానికి ఎంత సమయం తీసు కుంటుందో సూపరింటెండెంట్‌, చీఫ్‌ ఇంజి నీరింగ్‌ అధికారులకే తెలియాల్సి ఉంది. ఏదే మైనా ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల వైప ల్యం, ప్రకృతి ప్రతాపం చూపించిన సంగతి తెలి ఃసిందే. ప్రాజెక్టు పునరుద్ధరణలోనూ జిల్లా, రాష్ట్రఉన్నతాధికారుల పరిశీలన చేస్తున్నామనే పేరుతో కాలయాపనతో ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రక్రియ అప హాస్యం పాలవుతుండడం ఆందో ళన కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా నీటి పారు దల శాఖ అధికారుల పరిశీలన చేస్తున్నామనే పేరుతో నెలల తరబడి కాలయాపన చేయ కుండా, పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.