Apr 04,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ పయ్యావుల కృష్ణప్రసాద్‌

జాగ్రత్తలతోనే 'సుగర్‌' నివారణ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సుగర్‌ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి హాస్పిటల్‌ అధినేత ప్రముఖ డాక్టర్‌ పయ్యావుల కృష్ణప్రసాద్‌ తెలియజేశారు. మంగళవారం ఆత్మకూరు ఎంపిడిఒ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రీవారి హాస్పిటల్‌ అధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య అవగాహన సదస్సులో డాక్టర్‌ మాట్లాడుతూ సుగర్‌ వ్యాది అన్ని రకాల వ్యాధి లక్షణాలపై ప్రభావం ఎక్కువగా చూపుతుందని కిడ్నీ, పక్ష వాతం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని,
కావున ఈ వ్యాది వచ్చిన వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని సకాలంలో వైద్య పరీక్షలు తీసుకొని, రోజుకు అరగంట పాటు వాకింగ్‌ వ్యాయామలూ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణు గోపాల్‌రెడ్డి, ఎంపిడిఒ సి.శ్రీనివాసులు, హాస్పిటల్‌ మేనేజర్‌ దిలీప్‌యాదవ్‌ పాల్గొన్నారు.