Mar 31,2022 08:04

 తలపట్టుకురటున్న ఎపిపిఎస్‌సి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి :
   ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు నిధుల కొరత వేధిస్తోరది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భర్తీ చేసే ఉద్యోగాల ప్రక్రియకు నిధులు చాలే పరిస్థితి లేదని ఎపిపిఎస్‌సి అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయిరచిన నిధులు పాత బకాయిలు చెల్లిరచేరదుకే సరిపోతాయని, కొత్త పరీక్షలకు నిధులు అరదుబాటులో ఉరడవని వారు చెబుతున్నారు.

ఈ ఏడాది పలు ఉద్యోగ పరీక్షల నిర్వహణకు 23 కోట్లు అవసరం ఉరటురదని ఎపిపిఎస్‌సి చెబుతోరది. గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధిరచి ఈ ఏడాది అనేక పరీక్షలు నిర్వహిరచాల్సి ఉరది. వైద్య శాఖలో అధ్యాపకులు, మెడికల్‌ అధికారులు, ప్రొఫెసర్లు వంటి పోస్టులతోపాటు, శాసనసభలో రిపోర్టర్ల నియామకాలు, సమాచార శాఖలో ఎపిఆర్‌ఓలు, వ్యవసాయం, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, ఆర్ధికశాఖ, రవాణా, దేవాదాయం, అటవీ శాఖల్లో పలు ఖాళీలకు ఎపిపిఎస్‌సి నోటిఫికేషన్లు జారీ చేసిరది. ఇవి ఈ ఏడాది పరీక్షల ద్వారా భర్తీ చేయాల్సి ఉరటురది. వీటికే 23 కోట్లు ఖర్చు అవుతురదని అరచనా వేశారు. గతంలో పలు సంస్థల అవసరాల కోసం ఖర్చు చేసిన రూ. 21.50 కోట్ల బిల్లులు చెల్లిరపుల కోసం ఇరకా పెరడిరగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా గౌరవ వేతనాలు, ప్రకటనలు వంటి వాటికి 45 కోట్లు అవసరం ఉరటురదని అరచనా వేశారు. ఇవే గణారకాలను బడ్జెట్‌ ప్రతిపాదనలకు కూడా ఎపిపిఎస్‌సి పంపిరచిరది. అయితే బడ్జెట్‌లో మాత్రం 19.29 కోట్లను మాత్రమే కేటాయిరచారు. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. . ఇదే సమయంలో తాజాగా గ్రూప్‌-1 పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇవి కూడా ఈ ఏడాదే నిర్వహిరచాల్సి ఉరటురదని ఎపిపిఎస్‌సి అధికారులు చెబుతున్నారు.