ప్రజాశక్తి-హైదరాబాద్ : హైదరాబాద్ లో అదాయపు పన్ను శాఖ అధికారులు పలు చిట్స్ కంపెనీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు లక్ష్యంగా ఐటి సోదాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుండి 100 బృందాలు హైదరాబాదులో పలుచోట్ల ఐటీ సోదాలు చేపడుతున్నాయి. శంషాబాద్, అమీర్పేట, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయపను చెల్లింపులు పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో వ్యాపారవేత్తలు ప్రసాద్, రఘువీర్, కోటేశ్వరరావు ఇళ్లతో పాటు వారి కంపెనీల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంత భారీ స్థాయిలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. వీటితో పాటు తమిళనాడులో డీఎంకే ఎంపీ జగద్రక్షణ్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, వేలూరు, అరక్కోణం, కోయంబత్తూరులోని జగద్రక్షణ్‌కు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. దాదాపు 150 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో 70 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.










