ములకలచెరువు : ఇసుక రేవులు ఇసుకారుల పాలిట కాసుల వర్షం కురిపిస్తోంది. మండలంలోని కాలువపల్లె, గూడుపల్లె, వేపూరికోట, దేవుళ చెరువు, పెద్దపాళ్యం ప్రాంతాల్లోని వాగుల్లో, వంకల్లో ఇసుకను పట్టపగలే జెసిబి సాయంతో లోడేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఇసుక లోడేస్తున్నా అధికారులు పట్టిం చుకున్న పాపన పోలేదు. దీంతో ఇసుకాసురుల అగడాలు మితి మీరుతున్నాయి ములకలచెరువు మండలం, పెద్దపాళ్యం సమీపంలోని ఉన్న పెద్దేరు వాగులో రోజూ సుమారు పది ట్రాక్టర్లతో పట్టపగలే ఇసు కను లోడేస్తున్నారు. ప్రభుత్వ వాగులో ఇసుకను జెసిబిలతో ట్రాక్టర్లకు ఎక్కించి తరలిస్తు ండడంతో నిరుపేదలకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. లోడు ధర సుమారు రూ. 3వేలకు పైగా ఇసుకను విక్రయిస్తున్నారు. మం డలంలోని ఇసుకాసురుల ఆగడాలు అధిక మ య్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇసుక తరలిస్తున్నారు. గత ఏడాది స్థానిక తహ శీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, ఎంపిడిఓ, ఎస్సై, ఇసుక ట్రాక్టర్ల యాజ మానులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో ట్రాక్టర్ రోజూ రెండు లోడ్లు కంటే ఎక్కువ ఇసు కను తరలించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తరలించేందుకు తహశీల్దార్, ఎంపిడిఒ, పంచాయతీ కార్యదర్శి సంతకాలతో కూడిన అనుమతి తీసుకోవాలని సూచించారు. పస్తుతం ఈ ఆదేశాలు గాలిలో కలిసి పోయా యి. అధికారుల అనుమతి లేకుండానే ఇష్టా రాజ్యంగా ఇసుకను తలిస్తున్నారని పలువురు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల నుంచి అధికారులపై ఓత్తిళ్లు తెచ్చి ఇసుకను తరలిస్తున్నారు సమాచారం. పెద్ద పాళ్యం సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న పెద్దేరులో జెసిబిలతో అధిక లోతుగా ఇసుకను తోడేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఇసుకాసురలకు అధికారులు అండ దండలు ఉండడంతో వారి ఆటలు సాగు తున్నాయి. నిబంధనలు పాటించాల్సిన అధికారులే ఇలా చేయడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనుమతి లేకుండా తరలిస్తే కేసులు
ఇసుక తరలించే వారు అధికారుల నుంచి పర్మిట్లు పొందాలి. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలు జప్తు చేస్తాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తోడితే కఠినంగా వ్యవహరిస్తాం. అధికారుల నిర్ణయించిన ధర కంటే అధిక ధర లకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. -మల్లికా, సి ఐ , ఎస్ ఈ బి, మూలకల చెరువు










