ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి రొద్దం : మండలంలోని పెన్నా నదిలో నల్లూరి కల్లుకుంట మధ్య రోడ్డు దాదాపు 200 మీటర్ల పొడవునా మట్టిరోడ్డును సర్పంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రోడ్డు మొత్తంఇ సుకతో కప్పేయడంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు ఈ దారిమీద వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయపై గత నెల 24న ప్రజాశక్తి దినపత్రికలో 'రోడ్డును కప్పేసిన ఇసుక' అనే శీర్షిక ప్రచురితమైన కథనానికి అధికారులు, పాలకులు స్పందించారు. ల్లూరు సర్పంచి క్రిష్టప్ప, ఉప సర్పంచి కల్లుకుంట క్రిష్టప్ప సమస్యను పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ దృష్టికి తీసుకుపోయారు. దీంతో అయన స్పందించి రోడ్డు మరమ్మతులకు ఆదేశాలివ్వడంత రెండు రోజుల నుంచి నదిలో మట్టిరోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.. రోడ్డు మరమ్మతు చేపడుతుడటంతో మండల ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.










